FbTelugu

యుఎస్ పోలీసుకు 22.5 ఏళ్ల జైలు శిక్ష

వాషింగ్టన్: మిన్నియా పొలిస్ న్యాయస్థానం నేరారోపణ రుజువైన పోలీసు అధికారికి ఇరవై రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది. తప్పు చేసిన పోలీసు అధికారిని కూడా అమెరికా చట్టాలు వదిలిపెట్టకుండా శిక్షలు విధిస్తుంటాయి.

గతేడాది అఫ్రికా అమెరికన్ జార్జి ఫ్లాయిడ్ మరణానికి పోలీసు అధికారి డెరిక్ చౌవిన్ కారణమయ్యాడు. ఈ హత్యపై అమెరికాలో నివసిస్తున్న నల్లజాతీయులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. జార్జి ఫ్లాయిడ్ ను నడిరోడ్డుపై హింసిస్తూ చంపేసిన ఘటన అమెరికాను కుదిపేసింది. ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రభుత్వం అతన్ని గతేడాది విధుల నుంచి తొలగించింది. మిన్నియా పొలిస్ న్యాయస్థానం వాద ప్రతివాదనల తరువాత తప్పు చేసిన పోలీసు అధికారికి శిక్ష ఖరారు చేసింది. చేసిన నేరానికి ఇరవై రెండున్నర సంవత్సరాలు విధించింది. సత్ప్రవర్తన కనబరిస్తే డౌరిక్ శిక్ష కాలాన్ని 15 ఏళ్లకు తగ్గించవచ్చిన న్యాయస్థానం తీర్పునిచ్చింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.