FbTelugu

నిమిషాల్లో మారథాన్ పై జడివాన… 21 మంది మృతి

బీజింగ్: వాతావరణం ఒక్కసారిగా మారి జడివానం కురవడంతో మారథాన్ మధ్యలోనే 21 మంది చనిపోయారు. చైనా గాన్సూ ప్రావిన్స్ లోని ప్రముఖ పర్యాటన ప్రాంతం జింటాయ్ కౌంటీలో ఈ ఘటన జరిగింది.

శనివారం మధ్యామ్నం వంద కిలోమీటర్ల ఆల్ట్రా మారథాన్ జరిగింది. ఈ సమయంలో ప్రకృతి పగబట్టిందా అనే విధంగా ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. 20-31 కిలోమీటర్ల మధ్య ఒక్కసారిగా వడగళ్ల వాన విరుచుకుపడింది. ఈ మారథాన్ లో త్తంలో 172 మంది పాల్గొన్నారు. జోరువాన, వడగళ్లు సృష్టించిన భీభత్సం నుంచి తప్పించుకునే అవకాశమే లేకుండా పోయింది. ఎలాగోలా ప్రమాదం నుంచి 18 మందిని మాత్రం రక్షించారు. మిగిలిన వారి కోసం ఉధృతంగా గాలింపు చేస్తున్నారు. ఒక్కసారి శీతలంగా మారడంతో మారథాన్ లో పాల్గొన్నవారి శరీర ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.