FbTelugu

21 రోజులు లాక్ డౌన్: ప్రధాని

ఢిల్లీ: భారతీయులను కరోనా నుంచి కాపాడేందుకు ఈ రోజు అర్ధరాత్రి 12గంటల నుంచి పూర్తి లాక్ డౌన్ అమలు చేస్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.

ఇది జనతా కర్ఫ్యూ కంటే కఠినంగా ఉంటుందని, దేశ ప్రజల శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 21 రోజుల పాటు ఈ లాక్ డౌన్ అమలు లో వుంటుంది. ఇంటి నుంచి ఎవరూ కూడా బయటకు రాకుండా ఉండాలన్నారు. దండం పెడుతున్నాను, ఇంటికే పరిమితం కావాలని, ఇది కర్ఫ్యూ అని అన్నారు. జనతా కర్ఫ్యూ కంటే కఠినమైన కర్ఫ్యూ ఇది అని ఆయన స్పష్టం చేశారు.

ఇవాళ రాత్రి దేశ ప్రజలను ఉద్ధేశించి ప్రధాని ప్రసంగించారు. కరోనా మహమ్మారి లింక్ ను తెంచేందుకు ఈ సమయం చాలా అవసరం అన్నారు. ఈ మూడు వారాలు ఇంటికి మీరు పరిమితం కావాలి, బయటకు రావద్దని అన్నారు.

ఈ21 రోజులు బయటకు వెళ్లడం అనేది మరిచిపోండి. మీ భవిష్యత్, మీ పిల్లల కోసం నిర్ణయం తీసుకోకుండా తప్పడం లేదన్నారు. వైరస్ వ్యాప్తి చెందిన రోగి మొదటి రోజుల్లో ఆరోగ్యం గానే కనిపిస్తాడు. అందుకే ఈ వ్యాధి లక్షణాలు బయట పడటానికి సమయం పడుతుందన్నారు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More