FbTelugu

ఏపీలో 20,937 మందికి పాజిటివ్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 20 వేల పైనే కొత్త పాజిటివ్ కేసులు నమోదవ్వడం ఆందోళనకు గురి చేస్తోంది.

గడిచిన 24 గంటల్లో 92,231 నమూనాలను పరీక్షించగా 20,937 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ఏపి వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 15,42,079కి చేరగా, తాజాగా 104 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 9,904కి పెరిగింది. రాష్ట్రంలో ఇవాళ 20,811 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకొని డిశ్ఛార్జి అయ్యారని, ప్రస్తుతం రాష్ట్రంలో 2,09,156 క్రియాశీల కేసులు ఉన్నాయని తెలిపింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 15 మంది మృతి చెందగా ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో 10 మంది చొప్పున, తూర్పుగోదావరి, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో 9 మంది చొప్పున,  కృష్ణా జిల్లాలో 8 మంది, అనంతపురం, గుంటూరు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడుగురు చొప్పున, పశ్చిమగోదావరి జిల్లాలో ఆరుగురు చొప్పున చనిపోయారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.