FbTelugu

తెలంగాణలో కొత్తగా 2,092 కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి తీవ్రంగా పెరిగిపోతూ ఉంది. గడిచిన 24 గంటల్లోనే 2,092 కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 13 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.

తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 73,050 కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 589 కి చేరింది. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 52,103 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,358 యాక్టీవ్ కేసులున్నాయి.

You might also like