FbTelugu

అమెరికాలో ఒక్కరోజే 20,900 కరోనా కేసులు

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. గడిచిన ఒక్కరోజులోనే కొత్తగా 20,900 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. దీంతో ఆ దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19.88 లక్షలు దాటేసింది.

కాగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,12,096 మందికి చేరింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశంగా అమెరికా కొనసాగుతోంది.

You might also like