తొలిసారి 206 కేసులు నమోదు
హైదరాబాద్: తెలంగాణలో తొలిసారిగా 24 గంటల వ్యవధిలో 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఈ మేరకు తెలంగాణ మీడియా బులెటిన్ విడుదల అయ్యింది. గ్రేటర్ హైదరాబాద్ లో 152, రంగారెడ్డి లో 10, మేడ్చల్ లో 18, నిర్మల్, యాదాద్రిలో 5 చొప్పున, మహబూబ్ నగర్ లో 4, జగిత్యాల, నాగర్ కర్నూలులో 2 చొప్పున, మహబూబాబాద్, వికారాబాద్, జనగామ, గద్వాల, నల్గొండ, భద్రాద్రి, కరీంనగర్, మంచిర్యాలలో ఒకటి చొప్పున పాజిటివ్ కేసులు వచ్చాయి.
వలస కూలీలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో వైరస్ సోకలేదని ప్రకటించింది. ఇప్పటి వరకు 3496 కేసులు నమోదు కాగా, 1710 మంది డిశ్చార్జీ అయ్యారు. 1663 మంది ఆసుపత్రులలో చికిత్ప పొందుతుండగా ఈ రోజు 10 మంది చనిపోయారు. ఇప్పటి వరకు పాజిటివ్ సోకి 123 మంది మృతి చెందారు.