FbTelugu

కోల్డ్ స్టోరేజీలో పాడైపోయిన 20 వేల క్వింటాళ్ల మిర్చీ

గుంటూరు: కోల్డ్ స్టోరేజీలో నిల్వచేసిన 20 వేల క్వింటాళ్ల మిర్చీ పూర్తిగా పాడైపోయిన ఘటన జిల్లాలోని రాజుపాలెం మండలం, రెడ్డిగూడెంలోని వెంకటేశ్వర కోల్డ్ స్టోరేజీలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. కోల్డ్ స్టోరేజీలో గత వారం రోజులుగా ఏసీలు పనిచేయడం లేదని దీంతో మిర్చీ మొత్తం పాడైపోయిందని, ఈ ఘటనపై కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపించి తమను ఎలాగైనా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకొంటున్నారు.

You might also like