FbTelugu

20 రోజుల్లోనే 200 కోట్ల డోసులు సాధ్యం: కేంద్ర మంత్రి నితిన్

న్యూఢిల్లీ: దేశంలో పది ఫార్మా కంపెనీలకు అనుమతిస్తే కేవలం 15 నుంచి 20 రోజుట్లో దేశ ప్రజలకు అవసరమైన 200 కోట్ల డోసులు ఉత్పత్తి చేయవచ్చని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు.

ప్రతి రాష్ట్రంలో రెండు మూడు ప్రయోగశాలలు ఉన్నాయని, వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడానికి వారికి ఫార్మూలా ఇవ్వాలని ఆయన సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము ఆత్మనిర్భర్ భారత్ ను కోరుకుంటున్నామన్నారు. వర్చువల్ కాన్పరెన్స్ ద్వారా నితిన్ గడ్కరీ దేశంలోని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లతో ఆయన సమావేశమయ్యారు. వ్యాక్సిన్ డిమాండ్, సరఫరా మధ్య భారీ వ్యత్యాసం ఉంటే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. ఒకటి రెండు కంపెనీలకు బదులు పది కంపెనీలకు వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు లైసెన్స్ ఇస్తే 20 రోజుల్లోనే సమస్య పరిస్కారం అవుతుందన్నారు. భారత్ బయోటెక్, సీరం ఇనిస్టిట్యూట్ మాత్రమే వ్యాక్సిన్లను తయారు చేస్తున్నాయన్నారు. ముడిసరకు దిగుమతి ఇప్పటికీ భారత్ ఇతర దేశాలపై ఆధారపడుతున్నదన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.