FbTelugu

20 నుంచి ఏపి అసెంబ్లీ సమావేశాలు

అమారావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు తేదీ ఖరారు చేశారు. ఈ నెల 20వ తేదీ నుంచి సమావేశాలు నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రానికి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

ఈ సమావేశాల్లో 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలో బిఎసీ భేటీలో నిర్ణయించనున్నారు. తొలి రోజు రాష్ట్ర గవర్నర్ ప్రసంగముండగా.. అనంతరం ప్రసంగానికి ఉభయ సభలు ధన్యవాదాలు తెలపనున్నాయి. అసెంబ్లీలో బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య, శాసన మండలిలో చల్లా రామకృష్ణ రెడ్డిలకు సంతాపం ప్రకటించనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.