FbTelugu

జైపూర్ లోఆక్సిజన్ అందక 20 మంది మృతి

జైపూర్: కరోనా రోగంతో జనం చస్తుంటే దీనికి తోడు ఆక్సిజన్ కొరత పెను సమస్యగా మారింది. జైపూర్ నగరంలోని గోల్డెన్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 20 మంది మృతి చెందారు. మరో అరగంట పాటే ఆక్సిజన్ నిల్వలు ఉండడంతో ఐసియులో ఉన్న కరోనా పేషెంట్లతో పాటు ఇతర రోగులు భయంతో వణికిపోతున్నారు.

ఆక్సిజన్ కొరత వల్లే 20 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారని హాస్పిటల్ యాజమాన్యం వెల్లడించింది. మరో 200 మందికిపైగా రోగుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నారని వైద్యులు తెలిపారు. శుక్రవారం నాడు న్యూఢిల్లీలోని గంగారామ్ హాస్పిటల్ లో ఆక్సిజన్ లభ్యత లేక 25 మంది చనిపోయారు. ఈ ఘటనను ప్రజలు మరువక ముందే ఈరోజు రాజస్థాన్ లోని జైపూర్ లో మరో ఘటనలో 20 మంది చనిపోవడం ప్రజల గుండెలను పిండేస్తున్నది. ప్రధాని నరేంద్ర మోదీ ఆక్సిజన్ ఉత్పత్తిదారులతో సమావేశం నిర్వహించినా పరిస్థితి ఏమాత్రం అదుపులోకి రాకపోవడం శోచనీయం.

You might also like

Leave A Reply

Your email address will not be published.