FbTelugu

బంగాళాఖాతంలో మరో 2 వాయుగుండాలు!

అమరావతి: బంగాళాఖాతంలో మరో రెండు వాయుగుండాలు ఏర్పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ అంచనావేసింది. రేపు (ఈ నెల 29న) అల్పపీడనం వాయుగుండంగా మారి బలపడే అవకాశం ఉందని తెలిపింది.

ఇదిలా ఉండగా.. వచ్చేనెల 4-10 తేదీల మధ్య ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో నివర్ తుఫాన్ ప్రభావంతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.