FbTelugu

చైనాలో 2 కోట్ల మ‌ర‌ణాలు?

చైనాలో క‌రోనావైర‌స్ కార‌ణంగా ఎంత మంది చ‌నిపోయారు…? ఇప్పుడు ప్ర‌శ్న ప్ర‌పంచ‌వ్యాప్తంగా వినిపిస్తున్న ప్ర‌శ్న‌. చైనాలో 90వేల‌కు మించి కేసులు న‌మోదు కాలేద‌ని జిన్‌పింగ్ స‌ర్కారు కాకిలెక్క‌లు వ‌ల్లె వేస్తోంది.

చైనా బ్లాగ‌ర్ జెన్నిఫ‌ర్ ట్విటర్ వేదిక‌గా పంచుకున్న విష‌యాలు సంచ‌ల‌నం రేపుతున్నాయి. చైనాలో దారుణ ప‌రిస్థితుల‌ను తెలియ‌జేస్తున్నాయి. ఆమె లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌ల ఆధారంగా చైనాలో ఏకంగా 2.10కోట్ల మంది చ‌నిపోయి ఉంటార‌ని అంచ‌నాగా వ‌స్తోంది. జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రిలో చైనాలో భారీగా మొబైల్ నెట్‌వ‌ర్క్ యూజ‌ర్లు త‌గ్గిపోయారు. మార్చి నెల‌లో మొబైల్ నెట్‌వ‌ర్క్క్ ఇచ్చిన స‌మాచారం మేర‌కు ఏకంగా రెండు కోట్ల 10 ల‌క్ష‌ల మంది యూజ‌ర్లు త‌గ్గిపోయారు. అదే స‌మ‌యంలో చైనాలో క‌రోనావైర‌స్ భారీగా విస్త‌రించింది.

స‌రిగ్గా అదే స‌మ‌యంలో ఏకంగా 2.10కోట్ల మంది త‌గ్గిపోయారంటే వారంతా చ‌నిపోయార‌ని అంచ‌నా వేస్తున్నారు. అంతేకాదు వూహాన్‌లోని ఆసుప‌త్రుల వెనుక గుట్ట‌గుట్ట‌లుగా మొబైల్ ఫోన్లు ప‌డి ఉన్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలు జెన్నీఫ‌ర్ విడుద‌ల చేశారు. ఆ ఫోన్లన్నీ చ‌నిపోయిన వారివేన‌ని అనుమానం వ్య‌క్తం చేశారు. ఒక‌వేళ వారంతా చ‌నిపోక‌పోయి ఉంటే మొబైల్ కోసం వ‌చ్చేవారు. కానీ ఏ ఒక్క‌రూ ఫోన్ల కోసం రాలేదు. చైనాలో ముఖ్యంగా మూడు కంపెనీలు మొబైల్ నెట్‌వ‌ర్క్ అందిస్తున్నాయి. చైనా మొబైల్‌, చైనా టెలికాం, చైనా యూనికాం కంపెనీలు నెట్‌వ‌ర్క్ స‌ర్వీసు ప్రొవైడ‌ర్లుగా ఉన్నాయి. మార్చిలో స‌మ‌ర్పించిన నివేదిక ప్ర‌కారం ఈ మూడు స‌ర్వీసు ప్రొవైడ‌ర్ల‌కు సంబంధించి 2.10 కోట్ల యూజ‌ర్లు క‌నుమ‌రుగ‌య్యారు.

కేవ‌లం రెండు నెల‌ల్లోనే ఇంతస్థాయిలో త‌గ్గుద‌ల ఉండ‌దు. అందుకే వీరంతా కొవిడ్ బారిన ప‌డి చ‌నిపోయిన‌వారేన‌న్న అనుమానాలు వ్య‌క్తమ‌వుతున్నాయి. చైనీయులు వ‌ల‌స వెళ్ల‌డంతోనే మొబైల్ నెట్‌వ‌ర్క్స్ క‌ట్ అయ్యాయ‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు చెబుతున్నా, రెండు నెల‌ల్లో ఎక్క‌డికి వ‌ల‌స వెళ్లార‌న్న విష‌యంపై క్లారిటీ లేదు. చైనా నుంచి రెండు కోట్ల మంది ఇత‌ర దేశాల‌కు ఎలా వ‌ల‌స వెళ్లార‌న్న విష‌యంపై స్ప‌ష్ట‌త ఇవ్వ‌డం లేదు.

ఒక వైర‌స్ బాధితుల విష‌యంలోనూ చైనా దారుణంగా వ్య‌వ‌హరిస్తోంది. వైర‌స్ బాధితుల‌ను నీచంగా చూడ‌టం, దాడులు చేసి ఆసుప‌త్రుల్లో బంధించ‌డం జ‌రుగుతోంది. వూహాన్‌లో 5 ట‌న్నుల సామ‌ర్థ్యంతో 20 శ్మ‌శాన‌వాటిక‌లు చైనా ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిందంటే రోజుకు ఎన్ని వేల మందిని ద‌హ‌నం చేశారో అర్థం చేసుకోవ‌చ్చు.

You might also like