FbTelugu

రూ.108 కే రోజు 1జిబి డేటా

న్యూఢిల్లీ: ప్రైవేటు మొబైల్ ఆపరేటర్లకు ధీటుగా బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ ను ప్రకటించింది. ఈ ప్లాన్ లో రూ.108 తో రీఛార్జ్ చేసుకుంటే 60 రోజుల పాటు ప్రతి రోజు 1 జిబి డేటా లభ్యం కానున్నది.

ఈ డేటాతో పాటు అన్ లిమిటెడ్ కాలింగ్ అవకాశాన్ని కూడా కల్పించడం వినియోగదారులను ఆకర్షించనున్నది. ఒకవేళ డేటా అయిపోతే నెట్ డౌన్ లోడ్, అప్ లోడ్ స్పీడ్ 80 కెబిపిఎస్ తో పనిచేస్తుంది. ఈ కొత్త ప్లాన్ న్యూఢిల్లీ, ముంబై లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.