FbTelugu

జగన్ ఇల్లు ముట్టడించిన 1998 డిఎస్సీ అభ్యర్థులు

తాడేపల్లి: సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించిన 1998 డిఎస్పీ క్యాలిఫైడ్ ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 60 మంది ఉపాద్యాయులను అరెస్టు చేశారు.

సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగ ప్రాతిపదికన కల్పించాలని డిమాండ్ చేస్తూ వారు ఇవాళ ఉదయం ముట్టడించేందుకు తాడేపల్లి వచ్చారు. వెట్టి చాకిరి చేస్తూ గత 22 సంవత్సరాలుగా అన్యాయానికి  గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పలు రకాల జీఓ లు ఇచ్చి గందరగోళానికి గురి చేసి చేసారన్నారు. జీఓ 221 వల్ల నష్టపోయామని, వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో గుర్తించిన 3300 మంది అభ్యర్థులకు న్యాయం జరగలేదన్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన ఉపాధ్యాయులను మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.