FbTelugu

ఏపీలో 19, తెలంగాణలో 49 కొత్త కేసులు

అమరావతి: ఏపీలో కొత్తగా 19, తెలంగాణలో కొత్తగా 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ఇవాళ గుంటూరు లో 8, అనంతపూర్ లో 7, ప్రకాశం 3, పశ్చిమ గోదావరి లో ఒక కేసు నమోదు అయింది. దీంతో ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 348 కు చేరుకున్నది. ఈరోజు విశాఖపట్నంలో మగ్గురు డిశ్చార్జీ కాగా, ఇప్పటి వరకు తొమ్మిది మంది రికవరీ అయి డిశ్చార్జీ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణలో ఈరోజు 49 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 45 మంది డిశ్చార్జీ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రెండు వారాల్లోనే గచ్చిబౌలి స్టేడియంలో 1500 బెడ్స్ తో క్వారంటైన్ సెంటర్ అభివృద్ధి చేశామని తెలిపారు. అదే విధంగా ప్రతిరోజు 900 నమూనాలు పరీక్షిస్తున్నారు.

You might also like