FbTelugu

భారత్ లో ఒక్కరోజే 1,897 కేసులు

ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకి ఎక్కువౌతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే దేశంలో 1,897 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 73 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దేశ వ్యాప్తంగా నేటివరకు 31,332 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి.

కాగా కరోనా మహమ్మారి బారిన పడి 1,007 మంది మృత్యువాత పడ్డారు. కరోనా బారిన పడిన 7,695 మంది కోలుకొని ఆస్పత్రులనుంచి డిశ్చార్జ్ అయినారు. ప్రస్తుతం భారత్ లో కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 22,629 కి చేరింది. కాగా మహారాష్ట్రలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. మహారాష్ట్రలో 10 వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులున్నాయి.

You might also like