FbTelugu

ఏపిలో 18,767 పాజిటివ్ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 91,629 నమూనాలను పరీక్షించగా 18,767 మందికి పాజిటివ్ సోకినట్లు ఏపి వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15,80,827 కు చేరింది.

తాజాగా 104 మంది చనిపోగా ఇప్పటి వరకు 10,126 మంది చనిపోయారు. రాష్ట్రంలో 2,09,237 యాక్టివ్ కేసులు ఉన్నాయని, నిన్న ఒక్కరోజే 20,109 మంది కోలుకున్నట్లు తెలిపారు. వైరస్ బారిన పడి చిత్తూరు జిల్లాలో 15 మంది, పశ్చిమ గోదావరి 13, విజయనగరం 11, విశాఖ 9, అనంతపురం, తూర్పుగోదావారి, గుంటూరు, కర్నూలు, కృష్ణ లో 8 మంది చొపున, శ్రీకాకుళం 7, నెల్లూరు 6, కడప జిల్లాలో ముగ్గురు చనిపోయినట్లు బులెటిన్ లో వెల్లడించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.