FbTelugu

ఏపిలో 18,561 కేసులు

అమరావతి: ఏపిలో కరోనా కేసుల పెరుగుదల అలాగే కొనసాగుతున్నది. గడచిన 24 గంటల వ్యవధిలో 73,749 నమూనాలను పరీక్షించగా 18,561 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

దీంతో పాటుగా 109 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజా కేసులతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,54,052కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 9,481 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 12,33,017 మంది రోగులు కోలుకోగా.. రాష్ట్రంలో 2,11,554 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా పాజిటివ్ తో తల్లిదండ్రులు చనిపోయి చిన్న పిల్లలు ఉంటే వారిని ఆదుకునే విధంగా సాయం చేసేందుకు పథకం రూపొందించాలని అధికారులను సిఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.