న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 17,296 కేసులు నమోదైనాయి. ఇదేసమయంలో 407 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.
దేశ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 4,90,401 కి చేరింది. కాగా దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 1,89,463 కు చేరింది. కరోనా బారిన పడి ఇప్పటివరకు 2,85,637 మంది కోలుకున్నారు.