FbTelugu

బాలిస్టిక్ క్షిపణి దాడిలో 17 మంది దుర్మరణం

కైరో: యెమెన్ లో హౌతి తిరుగుబాటుదారులు బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేస్తున్నారు. వీరు ప్రయోగించిన క్షిపణులతో 17 మంది దుర్మరణం చెందారు.
కొన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు హౌతి తిరుగుబాటుదారులు కొద్ది నెలలుగా ప్రయత్నిస్తున్నారు.

మారిబ్ లోని రావ్దా సమీపంలోని గ్యాస్ స్టేషన్ లక్ష్యంగా దాడి జరిగిందని ప్రొవిన్షియల్ గవర్నర్ ప్రెస్ సెక్రెటరీ అలీ అల్ గులిసి ప్రకటించారు. ఈ దాడిలో 17 మంది చనిపోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవారందరూ పౌరులేనని అన్నారు. క్షిపణి దాడి చేసిన కొద్దిసేపటికే పేలుడు పదార్థాలతో మరో డ్రోన్ ను పేల్చేశారని ప్రభుత్వం ప్రకటించింది. గాయపడిన వారిని ఆసుపత్రికి చికిత్స కోసం తరలిస్తుండగా, డ్రోన్ రెండు అంబూలెన్స్ లను ధ్వంసం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.