FbTelugu

ఏపిలో 16 చోట్ల హెల్త్ హబ్ లు: జగన్

అమరావతి: రాష్ట్రంలో కనీసం 16 చోట్ల హెల్త్‌ హబ్‌లు ఏర్పాటు చేయాలని సిఎం వైఎస్.జగన్‌ మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఇవాళ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఆయన అధికారులకు సమీక్ష నిర్వహించారు.

జిల్లాల ప్రధాన కేంద్రాలతో పాటు విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరంలో హెల్త్‌ హబ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు సిఎం జగన్ తెలిపారు. ఒక్కో చోట కనీసం 30 నుంచి 50 ఎకరాలు స్థలం సేకరించాలని, ఆస్పత్రికి 5 ఎకరాల చొప్పున ప్రత్యేకంగా కేటాయించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మూడేళ్లలో కనీసం రూ.100కోట్లు పెట్టుబడి పెట్టే ఆస్పత్రులకు ఈ భూములు కేటాయించాలని అధికారులకు సూచించారు. దీని వల్ల రాష్ట్రంలో 80 మల్టీ, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు వస్తాయని, ప్రజలకు మెరుగైన వైద్యం ఇక్కడే అందుతుందని తెలిపారు. వీటితోపాట ప్రభుత్వం తరఫున 16 వైద్య కళాశాలలు, నర్సింగ్‌ కాలేజీలు రాబోతున్నట్లు సిఎం జగన్‌ పేర్కొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.