FbTelugu

విరించి హాస్పిటల్ లో గలాటా… 16 మంది అరెస్టు

హైదరాబాద్: బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ లో తమ బంధువు కు సరైన చికిత్స అందించక పోవడం మూలంగా చనిపోయాడంటూ హాస్పిటల్ లో సంబంధీకులు గలాటాకు దిగారు. గలాటా చేసిన వారిని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు.
దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కరోనా పాజిటివ్ తో ఒకరు విరించి హాస్పిటల్ లో చేరారు.

రోగి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు, స్నేహితులు కొందరు సిబ్బంది తో వాగ్వాదానికి దిగారు. అవేశంతో ఊగిపోయిన మృతుని బంధువులు తీవ్రంగా గలాటా సృష్టించారు. హాస్పిటల్ లోని కంప్యూటర్ ప్రింటర్ తో పాటు ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. హాస్పిటల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇన్ స్పెక్టర్ నిరంజన్ రెడ్డి ఘర్షణ కి కారకులైన 16 మందిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. మరి కొద్ది సేపట్లోనే వారందరిని మెజిస్ట్రేట్ ముందు కు తరలించనున్నారు. హాస్పిటల్ పై దాడి చేయడం సరైన చర్య కాదని, చికిత్స లో ఏదైనా లోపం కారణంగా రోగి మృతి చెందితే, సిబ్బంది వల్ల ఏదైనా అసౌకర్యం కలిగితే చట్టబద్దంగా తమకే పిర్యాదు చేయాలని ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.