FbTelugu

15వ స్థానంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్

హైదరాబాద్: ఉన్నత విద్యాసంస్థలకు కేంద్రం ప్రకటించిన ర్యాంకింగ్స్ లో తెలంగాణలోని పలు యూనివర్సిటీలు మంచి ర్యాంకులనే పొందాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 15 వ స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్స్ లో ఐఐటీ హైదరాబాద్ కు 17వ స్థానం దక్కింది.

ఐఐటీ వరంగల్ కు 46వ స్థానం దక్కింది. ఉస్మానియా యూనివర్సిటీకి 53వ స్థానం దక్కింది. ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటీ హైదరాబాద్ 8వ స్థానంలో నిలిచింది. నిట్ వరంగల్ కు 19వ స్థానం, జేఎన్టీయూ హైదరాబాద్ కు 57వ స్థానం, ఓయూ ఇంజనీరింగ్ కాలేజీకి 88వ స్థానం దక్కాయి.

You might also like