FbTelugu

ఏపీలో కొత్తగా 1,555 కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 1,555 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. దీనికి సంబంధించి ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనాతో కొత్తగా 13 మంది మృత్యువాత పడ్డారు.

దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,814 కి చేరింది. ఇప్పటివరకు ఏపీలో మొత్తం 277 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 11,383 యాక్టీవ్ కేసులున్నాయి. 12,154 మంది ఈ వైరస్ బారినుంచి కోలుకొని ఆస్పత్రులనుంచి డిశ్చార్జ్ అయినారు.

You might also like