FbTelugu

దేశంలో ఒక్కరోజే 1,543 కేసులు

ఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ రోజు రోజుకి విజృంభిస్తోంది. నేటికి కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య ఏకంగా 29,435 కు చేరుకుంది. కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు దేశంలో 934 మంది మృత్యువాత పడ్డారు.

కాగా కరోనా బారి నుంచి నేటివరకు 6,868 మంది కోలుకుని ఆస్పత్రులనుంచి డిశ్చార్జ్ అయినారు. దీంతో ప్రస్తుతం భారత్ లో కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 21,632 కు చేరింది. గడిచిన 24 గంటల్లోనే 1,543 కోత్త కేసులు నమోదైనాయి. ఒక్కరోజే 62 మంది మృత్యువాత పడ్డారు.

You might also like