FbTelugu

నిన్న ఒక్కరోజే 1,524 కేసులు నమోదు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే 1,524 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో 10 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37,745 కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 375 కి చేరింది.

కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 24,840 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 12,531 కి చేరింది. నిన్న ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 815 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి.

You might also like