FbTelugu

వైసీపీ హయాంలో 150 ఆలయాలు ధ్వంసం: సునీల్

అమరావతి: రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక 150 దేవాలయాల్లో దాడులు వరుసగా జరిగాయని, వీటిని నియంత్రించడంలో సీఎం జగన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి సునీల్ ధియోధర్ విమర్శించారు.
రాష్ట్రం లో హిందూ ఆలయాల పై దాడులు పెరిగిపోతున్నాయని, విజయవాడ లో సీతాదేవి‌ విగ్రహం కూల్చిన ఘటన బాధాకరమన్నారు. కనీసం‌ ఘటన జరిగిన ప్రదేశాలను కూడా మంత్రులు పరిశీలించడం లేదన్నారు.

ఇంత జరుగుతున్నా సీఎం మౌనంగా ఉన్నారంటే ఏమనుకోవాలని ఆయన ప్రశ్నించారు. ఈ వరుస ఘటనలకు బాధ్యత వహిస్తూ, దేవాదాయ శాఖ మంత్రి పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని సునీల్ ధియోధర్ ప్రశ్నించారు.
రాష్ట్రం లో శాంతి‌భద్రతలకు‌ విఘాతం కలుగుతుంటే ఏం చేస్తున్నారన్నారు. ఇప్పటి వరకు ఒక్క కేసులో అయినా దోషులను పట్టుకోలేక పోయారన్నారు. రామతీర్థం విషయంలో రాజకీయం చేయడం సరి కాదన్నారు. చంద్రబాబు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని, ఆయన సీఎం గా 50 ఆలయాలను పడగొట్టించారన్నారు. వైసీపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని సునీల్ ధియోధర్ హెచ్చరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.