FbTelugu

15 లక్షల ఇళ్లు కేంద్రానివే: సోము వీర్రాజు

అమరావతి: ఏపీలో జగన్ ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పుకుంటున్న 30 లక్షల ఇళ్ల పథకంలో 15 లక్షల ఇళ్లు కేంద్రానివే అంటూ.. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ రాజధానిగా అమరావతికి బీజేపీ పూర్తి మద్దతు పలుకుతోందని అన్నారు.

త్వరలోనే విజయవాడలో బీజేపీ రాష్ట్ర కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మోదీ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీని అప్పులపాలు చేశాయని మండిపడ్డారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.