న్యూఢిల్లీ: భారత్ లో లాక్ డౌన్ కు కేంద్రం సడలింపులు ఇచ్చిన తర్వాత కరోనా కేసులు విపరీతంగా పెరిపోతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లోనే 14,933 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 327 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.
కరోనాపై భారత వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,40,215 కు చేరింది. కాగా ఇప్పటివరకు కరోనాతో 14,011 మంది మృతి చెందారు. యాక్టీవ్ కేసుల సంఖ్య 1,78,014 కి చేరింది.