FbTelugu

ఆర్బీఐ పరిధిలోకి 1,482 సహకార బ్యాంకులు

న్యూఢిల్లీ: ఆర్బీఐ పరిధిలోకి త్వరలోనే 1,482 సహకార బ్యాంకులను తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఇవాళ ప్రధాని మోదీ నివాసంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

58 మల్టీ స్టేట్ కోఆపరేటీవ్ బ్యాంకులు కూడా ఆర్భీఐ పరిధిలోకి తీసుకురానున్నట్టు సమాచారం. కరోనా విజృంభణ, నివారణ చర్యలతో పాటూ.. భారత్ చైనా సరిహద్దు ఘర్షణలపై ఈ భేటీలో కీలక చర్చ జరిపారు. బ్యాంకింగ్ రంగంలో కీలక సంస్కరణలు తీసుకొచ్చినట్టు కేంద్ర మంత్రి జవదేకర్ తెలిపారు.

You might also like