FbTelugu

24 గంటల్లో 146 మంది మృతి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి తీవ్రంగా పెరిగిపోతూ ఉన్నాయి. గడిచిన 24 గంటల్లోనే భారత్ లో 146 మంది కరోనాతో మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 6,535 కరోనా

పాజిటివ్ కేసులు నమోదైనాయి. నేటికి దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 1,45,380కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 4,167కి చేరింది. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 60,490కి చేరింది. దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 80,722గా ఉంది.

You might also like