FbTelugu

జీహెచ్ఎంసీలో 14,561 కి చేరిన కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి తీవ్రంగా పెగిపోతూ ఉంది. నిన్న ఒక్క రోజే కొత్తగా 1,213 కేసులు నమోదైనాయి. 8 మంది మృతి చెందారు. నేటికి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,570 కి చేరింది.

ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,561 కి చేరింది. కరోనా బారిన పడి నేటి వరకు 9,068 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 9,226 కు చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 98,153 కరోనా టెస్టులు చేసినట్టు సమాచారం.

You might also like