FbTelugu

తెలంగాణలో 143 కేసులు

హైదరాబాద్: తెలంగాణలో గడచిన 24 గంటల వ్యవధిలో 143 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు మీడియా బులెటిన్ విడుదల చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 116, రంగారెడ్డిలో 8, మహబూబ్ నగర్ లో 5, వరంగల్ లో 3, ఖమ్మం, అదిలాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, కరీంనగర్ లో రెండు చొప్పున, మంచిర్యాలలో 1 కేసు నమోదు అయింది. వలస కూలీలు, ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారిలో ఒక్కరికి కూడా పాజిటివ్ సోకలేదు. మొత్తం 3290 కేసులు కాగా, ఇప్పటి వరకు 1627 మంది డిశ్చార్జీ అయ్యారు. 1550 మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా, ఈరోజు 8 మంది మృతి చెందగా ఇవ్వాల్టి వరకు 113 మంది చనిపోయారు.

You might also like