FbTelugu

దేశంలో కేసులు 14 లక్షలు దాటాయి…

ఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. గడచిన 24 గంటల్లో నమోదైన కేసులతో మొత్తం కేసులు 14 లక్షలు దాటగా, 33 వేలకు చేరువలో మరణాలు ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో 49,931 కరోనా పాజిటివ్ కేసులు రాగా, 708 మంది మృతి చనిపోయారు. దేశంలో మొత్తం కేసులు 14,35,453, ఇప్పటి వరకు 32,771 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా 4,85,114 యాక్టీవ్ కేసులు ఉండగా 9,17,568 మంది డిశ్చార్జ్ అయ్యారు గడిచిన 24 గంటల్లో 31,991 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

You might also like