FbTelugu

ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ లో 14 మంది హతం?

బీజాపూర్: మావోయిస్టుల కోసం శనివారం సుక్మా-బీజాపూర్ సరిహద్దుల్లో కూంబింగ్ జరుగుతున్న సందర్భంలో ఎదురు కాల్పులు మొదలయ్యియి. ఈ ఎదురు కాల్పుల్లో ఇఫ్పటి వరకు 14 మంది మృతదేహాలు వెలికి తీశారు.
భద్రతా దళాలు-మావోయిస్టుల మధ్య భీకరపోరు జరుగుతోంది. ఈ ఎన్ కౌంటర్ లో ఆరుగురు భద్రతా సిబ్బంది, ఒక మహిళా మావోయిస్టు చనిపోయినట్లు తొలుత వార్తలు వచ్చాయి. ఈ రోజు 14 మృతదేహాలను బయటకు తీసినట్లు ఒక వార్తా సంస్థ వెల్లడించింది. ఇంకా మావోయిస్టుల కోసం కూంబింగ్ జరుగుతునే ఉంది. ఇంకా 21 మంది భద్రతా సిబ్బంది ఆచూకి లభించడం లేదని సమాచారం. వీరిలో ఏడుగురు సీర్పిఎఫ్ సిబ్బంది ఉన్నారు.

ఘటనలో చనిపోయిన వారిని పరిశీలిస్తే మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని బీజాపూర్ పోలీసులు అంటున్నారు. భద్రతా సిబ్బంది ఆచూకి కోసం టర్రెం అటవీ ప్రాంతానికి పెద్ద ఎత్తున అదనపు బలగాలను తరలించారు. చత్తీస్ గఢ్ లో పరిస్థితిని సమీక్షించాలని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ కులదీప్ సింగ్ ను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదేశించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.