FbTelugu

బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్

కడప: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీని నిన్న చెన్నై విమానాశ్రయంలో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఇవాళ అతన్ని జిల్లా మెజిస్ట్రేటు ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ కు విధించారు. దీంతో పోలీసులు బీటెక్ రవిని కడప సెంట్రల్ జైలుకు తరలించినట్టుగా తెలిపారు.

2018 లో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య జరిగిన భారీ ఘర్షణకు బీటెక్ రవి ఏ2 ముద్దాయిగా ఉన్నారు. అయితే తన అరెస్టు తీరుపై బీటెక్ రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. తానేమీ విదేశాలకు పారిపోయే వ్యక్తిని కాదని.. అయినా తనని అరెస్టు చేసిన తీరు విచారకరమని అన్నారు. కావాలనే కుట్రపూరితంగా వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేయించిందని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.