FbTelugu

13 ఏళ్ల బాలుడికి వ్యాక్సిన్ ఇచ్చేశారు…

భోపాల్: కొందరికి కరోనా వ్యాక్సిన్ వేయకుండానే వేసినట్లు మెస్సేజిలు వస్తున్నాయి. ఇంకా విచిత్రమేమంటే 13 ఏళ్ల బాలుడికి వ్యాక్సిన్ వేసినట్లు మెస్సేజి రావంతో తండ్రి కంగుతిన్నాడు.
వేదాంత్ డాంగ్రే (13) భోపాల్ లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఈ నెల 21న బాలుడు తండ్రి రజత్ కు రాత్రి 7.27 కు కోవిన్ వెబ్ ఫోర్టల్ నుంచి ఒక మెస్సేజి వచ్చింది. దాన్ని చూసిన కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. వేదాంత్ డాంగ్రే కు వ్యాక్సిన్ వేసినట్లు వచ్చింది. దేశంలో 18 ఏళ్లకు పైబడిన వారికే మాత్రమే ఇస్తున్నారు. ఇంకా బాలలకు వ్యాక్సిన్ రాలేదు. అంతే కాకుండా వేదాంత్ వయస్సు 56 సంవత్సరాలుగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉచిత వ్యక్సిన్ కార్యక్రమం ప్రారంభించిన తరువాత ఈ మాయ మొదలైంది. దొంగ ఆధార్ పత్రాలు చూపించి కొందరు వ్యాక్సిన్ వేయించుకుంటున్నట్లు అర్థమవుతోంది.

ఇతనికే కాకుండా మధ్యప్రదేశ్ లో చాలా మందికి ఇలాంటి మెస్సేజి వచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒకేరోజు జూన్ 21న 17.42 లక్షల మందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. చాలా మందికి వ్యాక్సిన్ తీసుకోకుండానే తీసుకున్నట్లు సమాచారం రావడంతో కంగుతిన్నారు. సాత్నా జిల్లాలో దేవేంద్ర పాండేకు ఐదు నిమిషాల వ్యవధిలో మూడు డోసులు ఇచ్చినట్లు ముగ్గురి పేర్లతో మెస్సేజిలు రావడంతో ఆశ్చర్యపోయాడు. ఇంతకు ఆ వ్యక్తులు ఎవరో తనకు తెలియదని లబోదిబోమన్నాడు. భోపాల్ లో నుజాహత్ సలీమ్ (46) కు ఎటువంటి పెన్షన్ రాకుండానే వస్తున్నట్లు చూపించి ఒక డోసు వేయించుకున్నట్లు రాత్రి 10.57కు మెస్సేజి వచ్చింది. ఇలా మెస్సేజి రావడంతో తాము వ్యాక్సిన్ ఎలా తీసుకోవాలో అర్థం కాక పలువురు ఆందోళన చెందుతున్నారు. తమ పేరు మీద కొందరు దొంగలు ఉచితంగా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి వైద్య, ఆరోగ్య సిబ్బంది కూడా మద్ధతు ఉందని ఆరోపిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.