FbTelugu

కేబుల్ కారు ప్రమాదంలో 13 మంది మృతి

రోమ్: ఇటలీ దేశంలో ఆదివారం నాడు తీవ్ర విషాద ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడి చికిత్స తీసుకుంటున్నారు

మాగియోర్ సరస్సు అందాలను ఎత్తైన ప్రదేశం నుంచి చూసేందుకు కేబుల్ కార్ ఏర్పాటు చేశారు. ఈ కేబుల్ కారు నుంచి పర్యాటకలు మాగియోర్ సరస్సును తిలకిస్తారు. ఇందులో వెళ్లిన ప్రతిసారి 15 మంది కూర్చుంటారు. మరో వంద మీటర్లు వెళ్తే పర్వత శిఖరంపై దిగుతారనగా కేబుల్ అకస్మాత్తుగా తెగింది. అందులో ఉన్న 15 మంది పర్యాటకులు పల్టీలు కొడుతూ కిందపడింది. కరోనా మహమ్మారి కారణంగా ఇటీవలే దీన్ని ప్రారంభించామని, 1998 తరువాత జరిగిన పెద్ద ప్రమాదం ఇదేనని స్టెసా మేయర్ మార్సెల్లా ప్రకటించారు. చెల్లాచెదురుగా పడిన వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.