FbTelugu

13మంది కరోనా రోగులు సజీవ దహనం

ముంబయి: అసలే ఎండాకాలం ఆపై కరోనా మహమ్మారితో రోగులు చికిత్స పొందుతున్న ఆసుపత్రులలో జరుగుతున్న ప్రమాదాలతో ప్రాణాలు హరీమంటున్నాయి.

కరోనా రోగులు చికిత్స పొందుతున్న ఆసుపత్రులలోనే జరుగుతుండడంతో వారి  కుటుంబ సభ్యుల గుండెలను పిండేస్తున్నది. పాల్ఘర్‌ జిల్లా వాసాయిలోని విజయ్‌ వల్లభ్‌ ఆస్పత్రి ఐసియూలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఐసియులో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో 13 మంది రోగులు సజీవ దహనం అయ్యారు. మృతుల్లో 10 మంది మహిళలు ఉన్నారు. ఘటన జరిగిన సమయంలో ఐసియూలో 17 మంది చికిత్స పొందుతున్నారు. మిగతా వారిని ఇతర ఆస్పత్రులకు తరలించారు. ఐసియులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.