FbTelugu

ఇండియా@1.26 లక్షల కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కొనసాగుతున్నది. ఇవాళ కేంద్ర ఆరోగ్య శాఖ వెలువరించిన లెక్కల ప్రకారం గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,26,789 కొత్త కేసులు నమోదు అయ్యాయి.

మొత్తం కేసుల సంఖ్య 1,29,28,574 కు చేరుకోగా, యాక్టివ్ కేసులు 9,10,319 ఉన్నాయి. గత 24 గంటల్లో 600 మందికి పైగా చనిపోగా ఇప్పటి వరకు 1,66,862 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో బుధవారం నాడు 59వేల కొత్త కేసులు నమోదు కాగా 322 మంది చనిపోయారు. దేశంలో నమోదు అవుతున్న పాజిటివ్ కేసులలో సగం ఇక్కడి నుంచే నమోదవుతుండడం కలవరపరిచే అంశం.

You might also like

Leave A Reply

Your email address will not be published.