FbTelugu

24 గంటల్లోనే 122 మంది మృతి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకి తీవ్రంగా వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లోనే దేశంలో కరోనా బారిన పడి 122 మంది మృత్యువాత పడ్డారు. కాగా అదే 24 గంటల్లో కొత్తగా 3,525 మందికి కరోనా సోకింది.

ఇప్పటి వరకు దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య ఏకంగా 2,415 కి చేరింది. నేటికి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 74,281 కిచేరింది. ఇందులో 24,386 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినారు. ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టీవ్ కేసుల సంఖ్య 47,480 కి చేరింది.

You might also like