FbTelugu

1200 మంది బ్యాంకు ఉద్యోగులు బలి

ముంబయి: కరోనా వైరస్ బ్యాంకు ఉద్యోగులను చిదిమేస్తున్నది. ప్రజలకు ఇబ్బంది లేకుండా సేవలు అందిస్తున్న బ్యాంకు ఉద్యోగులపై కరోనా పంజా విసురుతునే ఉంది. ఇప్పటి దాకా 1200 మంది ఉద్యోగులు మరణించినట్లు అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య వెల్లడించింది.

దేశంలో లాక్ డౌన్ విధించినా అత్యవసర సేవల రంగంలో ఉన్న బ్యాంకులు మాత్రం పనిచేస్తున్నాయి. 50 శాతం సిబ్బందితో పనిచేయడం, పని వేళలను కుదించినా సేవలకు అంతరాయం మాత్రం కలగడం లేదు. అయినప్పటికీ ఉద్యోగులను వైరస్ భూతం వెంటాడుతునే ఉన్నది. అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య అధ్యక్షుడు సిహెచ్.వెంకటాచలం మాట్లాడుతూ, కరోనా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 1200 మంది చనిపోయారన్నారు. ఇంకా వేలాది మంది కరోనా పాజిటివ్ తో పోరాడుతున్నారన్నారు. కరోనా బారిన పడిన ఉద్యోగులు, చనిపోయిన వారి వివరాలు బహిర్గతం చేసేందుకు బ్యాంకు యాజమాన్యాలు ముందుకు రావడం లేదన్నారు. మరణించిన కుటుంబాలకు ఇవ్వాల్సిన పరిహారంపై విధివిధానాలు ప్రకటించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కువ మంది చనిపోతున్నందున బ్యాంకు, ఇన్సూరెన్స్ ఉద్యోగులకు మొదటి ప్రాధాన్యం కింద వ్యాక్సిన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని వెంకటాచలం తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.