FbTelugu

ఒడిశా జైలులో 120 మందికి పాజిటివ్

భువనేశ్వర్: ఒడిశాలోని జైళ్లలో కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 120 మంది ఖైదీలకు పాజిటివ్ సోకినట్లు తేలింది. రోగం ముదిరిపోవడం, సకాలంలో గుర్తించకపోవడంతో ఇద్దరు ఖైదీలు చనిపోయారు.
కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో కరోనా కేర్ సెంటర్లకు తరలించి చికిత్స చేయిస్తున్నామని ఒడిశా జైళ్ల శాఖ డిఐజి సుభాకాంత మిశ్రా వెల్లడించారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూడు నెలల వ్యవధిలో 449 మంది దోషులను బెయిల్ పై విడుదల చేశామన్నారు. పట్నాగఢ్ సబ్ జైలు, బెర్హంపూర్ జైళ్లలను కరోనా కేర్ సెంటర్లుగా మార్చామన్నారు. ఒడిశాలో గురువారం నాడు 10,649 కేసులు నమోదు కాగా 19 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 5,76,297 మందికి పాజిటివ్ సోకగా, 2,251 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,00,313 ఉన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.