FbTelugu

12 మంది యువతులకు వల… ఇంజనీర్ అరెస్టు

ముంబయి: పెళ్లి చేసుకుంటానని యువతును ఆకర్షించి వారిని లైంగికంగా వేధించిన ఇంజనీర్ ను ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. పలు సెక్షన్లు విధించి జైలు కు పంపించారు.
మలాద్ ప్రాంతానికి చెందిన మహేష్ అలియాస్ కరణ్ గుప్తా ఉన్నత విద్యావంతులైన యువతులను ఆకర్షించించేందుకు మాట్రిమోనీ సైట్ లో ప్రొఫైల్ సృష్టించాడు. తను ఉన్నత విద్యావంతుడినని, లేని హోదాలను చూపిస్తూ పలువురు యువతులను మోసం చేశాడు.

సైట్ లో అందమైన అమ్మాయిల వివరాలు సేకరించి మొబైల్ ఫోన్ ద్వారా సంప్రదించేవాడు. వారితో పబ్ లు, రెస్టారెంట్లు, మాల్స్ లో సమావేశమై యువతులను లైంగికంగా వేధించేవాడు. ప్రతిసారి ఒక మొబైల్ నెంబర్ ఉపయోగించి క్యాబ్ లను బుక్ చేసుకునేవాడు. కంప్యూటర్ హ్యాకర్ గా పనిచేసిన అనుభవంతో యువతులకు చిక్కకుండా వలవేసేవాడని డిప్యూటీ పోలీసు కమిషనర్ సురేష్ తెలిపారు. విచారణలో మహేష్ తన నేరాన్ని ఒప్పుకోవడంతో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని ఆయన చెప్పారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.