FbTelugu

12 మంది టీడీపీ సభ్యులు సస్పెండ్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతకాల సమావేశాలు స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన ఇవాళ్టి నుంచి ప్రారంభమైనాయి. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు వరదలు, రైతు సమస్యలు వంటి అంశాలపై తీవ్రంగా పట్టుబట్టడంతో స్పీకర్ 12 మంది టీడీపీ సభ్యులు సస్పెండ్ ఒకరోజు పాటూ సస్పెండ్ చేశారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వెంటనే పరిహారం చెల్లించి రబీలో పెట్టుబడులకు ఆసరా ఇవ్వాలని, రైతు సమస్యలపై చర్చించాలని టీడీపీ పట్టుబట్టింది.

దీనిపై సీఎం జగన్‌ స్పందిస్తూ ఇప్పటికే రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టినట్టుగా స్పష్టం చేసినప్పటికీ టీడీపీ సభలో స్పీకర్‌ పోడియం ముందు కూర్చుని తమ ఆందోళనను కొనసాగించడంతో స్పీకర్ తమ్మినేని చంద్రబాబుతో సహా 12 మందిని (సత్యప్రసాద్‌, మంతెన రామరాజు, అచ్చెన్న, బుచ్చయ్య, కేశవ్‌, రామానాయుడు, సాంబశివరావు, ఆదిరెడ్డి భవానీ, అశోక్‌, జోగేశ్వర్‌రావు, రామకృష్ణబాబు, బాలవీరాంజనేయస్వామి) ఒకరోజు పాటూ సస్పెండ్ చేశారు. ఈ సమావేశాలు ఐదు రోజుల పాటూ కొనసాగనున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.