FbTelugu

హైవే కిల్లింగ్ కేసులో 12మందికి ఉరిశిక్ష

ఒంగోలు: రాష్ట్రంలో సంచలన సృష్టించిన హైవే కిల్లర్ అబ్దుల్ సమద్ అలియాస్ మున్నా కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో దోషులు అయిన 12 మందికి ఉరిశిక్ష విధిస్తూ ఇవాళ తీర్పునిచ్చారు.

2008 లో జాతీయ రహదారిపై వాహనాల దొంగతనం, డ్రైవర్ల హత్య ఘటనలో అబ్దుల్ సమద్ ను అరెస్టు చేశారు. ఈ కేసుపై ఒంగోలు లోని జిల్లా 8వ అదనపు సెషన్స్ కోర్టులో సుధీర్ఘంగా విచారణ జరిగింది. నేరం నిరూపణ కావడం, బలమైన సాక్ష్యాధారాలు లభించడంతో జడ్జి అబ్దుల్ సమద్ తో పాటు 11 మందికి ఉరిశిక్ష విధించారు. మరో ఏడుగురికి యావజ్జీవ శిక్ష విధించారు. అబ్దుల్ సమద్ గ్యాంగ్ మొత్తం ఏడు కేసుల్లో 13 మందిని దారుణంగా హింసించి హత్య చేశారు. పోలీసులకు కూడా ఆధారాలు లభ్యం కాకుండా హత్యలు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఏడు కేసుల్లో మూడు కేసుల్లో మాత్రమే తీర్పునిచ్చారు. మరో నాలుగు కేసుల్లో ఇంకా తీర్పులు రావాల్సి ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.