FbTelugu

ఏపీలో 11,698 పాజిటివ్ కేసులు

అమరావతిఫ  ఏపీలో కరోనా విలయతాండవం చేస్తున్నది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 11,698 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కరోనాతో 37 మంది మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.

తాజా మరణాలతో ఏపీలో 7,616కి కరోనా మరణాలు చేరాయి. కరోనా పాజిటివ్ కేసులు 10,20,926కి చేరుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఏపీలో 81,471 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తూ.గో, నెల్లూరు జిల్లాల్లో ఆరుగురు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో నలుగురు, ప.గో, శ్రీకాకుళం జిల్లాల్లో ముగ్గురు, గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందగా ప్రకాశం జిల్లాలో ఒక్కరు చొప్పున మృతి చెందినట్లు తెలిపారు.

విజయవాడలో జ్యూయలరీ షాపుల బంద్‌…

రాష్ట్రంలో కరోనా విజృంభణతో స్వచ్ఛందంగా విద్యా, వాణిజ్య సంస్థల మూసివేతకు వ్యాపారులు నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ బులియన్ మర్చంట్స్, బెజవాడ జ్యూయలరీ బులియన్ మర్చంట్ అసోసియేషన్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 26 నుంచి మే 3 వరకు జ్యూయలరీ షాపుల బంద్‌కు నిర్ణయించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.