FbTelugu

తెలంగాణలో 116 కరోనా కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం రాత్రి 8 గంటల వరకు 20,375 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా116 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి.
ఇప్పటి వరకు మొత్తం నమోదైన కేసుల సంఖ్య 2,98,923కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఇవ్వాళ హెల్త్ బులిటెన్‌ విడుదల చేసింది.

కాగా కరోనాతో నిన్న ఎవరూ మృతి చెందలేదు. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే165 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,95,387కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,902 ఉండగా వీరిలో 804 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 26 కేసులు నమోదు అయినట్లు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.