FbTelugu

ఔరా అన్పించిన బాలిక… 13 నిమిషాల్లో 111 బాణాలు

చెన్నై: ఆడి పాడాల్సిన వయస్సులో విలువిద్యలో ప్రావిణ్యం సాధించింది. ప్రపంచ రికార్డు నెలకొల్పే దిశగా బాలిక ముందుకు సాగుతున్నది. చెన్నైకి చెందిన ఐదేళ్ల బాలిక అందరిచేత శెహబాష్ అనిపించుకుంటున్నది.
స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని సంజన 13 నిమిషాల్లో 111 బాణాలు వేసింది. నిటారుగా నిలిచి కాకుండా తల్లకిందులుగా నిల్చుని బాణాలు వేసింది. తాను అనుకున్న లక్ష్యాన్ని 13 నిమిషాల 12 సెకన్లలో పూర్తి చేసింది. ప్రపంచంలోనే ఈ ఫిట్ సాధించిన ప్రథమ బాలికగా నిలిచింది. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు కు ఈ ఫిట్ ను పంపిస్తున్నట్లు ట్రైనర్ షిహాన్ హుస్సేన్ మీడియాకు తెలిపారు.

ఈ సందర్భంగా బాలిక సంజన తండ్రి మాట్లాడుతూ తన కుమార్తె ఒలంపిక్స్ ఆర్చరీలో ప్రాతినిథ్యం వహించాలనేదే తన ఏకైక లక్ష్యమన్నారు. అక్కడకు వచ్చిన పలువురు బాలికను అభినందించారు.

You might also like